![]() |
![]() |

పింకీ అలియాస్ సుదీప.. బిగ్ బాస్ సీజన్ -6 తో అందరికి సుపరిచితమైన నటి. అంతకముందు 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలో హీరోయిన్ ఆర్తీ అగర్వాల్ కి చెల్లి పింకీగా చేసి మంచి పేరు తెచ్చుకుంది. అప్పటినుండి అందరూ ఆ సినిమాలో చేసినా పింకి కదా అని తనని అనేవారంట. దాంతో తన పేరుని సుదీప పింకి అని మార్చేసుకుంది. బిగ్ బాస్ లోకి వెళ్ళాక అక్కడ ఎక్కువ సమయం కిచెన్ లోనే గడిపిన సుదీపని అందరూ ఒక అమ్మగా చూసేవారే తప్ప.. తోటి కంటెస్టెంట్ గా ఎవరూ చూసేవారు కాదు. బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు ఎప్పుడు చూసిన పని పని అంటూ గడిపిన సుదీప.. బయటకొచ్చాక ఫ్యామిలీతో గడుపుతూ ఎంజాయ్ చేస్తుంది.
అయితే బిగ్ బాస్ సీజన్-6 తర్వాత ఇంట్లోనే ఫ్యామిలీ తో గడుపుతూ బిజీగా ఉంటున్న పింకి అలియాస్ సుదీప.. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో ఖతర్ వెళ్ళినట్టుగా పింకి పోస్డ్ చేసిన ఫోటోలు.. అప్పట్లో ఎంత వైరల్ గా మారాయో అందరికి తెలిసిందే. ఆ తర్వాత ఇండియాకి వచ్చాక తను కొత్తగా కొన్న గింబల్ కొందని పొస్ట్ చేసింది. ఆ తర్వాత వరుసగా ట్రెండింగ్ రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది సుదీప.
సుదీప తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. పులితో కలిసి తను దిగిన కొన్ని ఫోటోలని కలిపి వీడియోగా ఎడిట్ చేసి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది సుదీప. ' Dare to be a tiger in a world full of sheep' అని టైటిల్ పెట్టి పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చుట్టూ ఉన్న ఎన్నో మేకల మధ్యలో ధైర్యంగా పులిలా ఉండాలని సుదీప మాటల్లో చెప్పింది. కాగా తన బిగ్ బాస్ ఫ్రెండ్స్ అంతా సూపర్ అంటూ సుదీపకి అభినందనలు తెలుపుతున్నారు.
![]() |
![]() |